English   

సెకండ్ సినిమా సిండ్రోమ్ భయపెట్టి....సంతోష పెట్టారు

directors
2019-04-22 20:47:37

సెకండ్ సినిమా సిండ్రోమ్  అనే జబ్బు మెడికల్ టెర్మనాలజీలో ఏమీ లేదు కానీ సినిమా టెర్మనాలజీలో మాత్రం "సెకండ్ సినిమా సిండ్రోమ్" అనేది చాలా పాపులర్. ఈ సిండ్రోమ్ బారిన పడకుండా గట్టెక్కిన డైరెక్టర్స్ ను వేళ్ళతో లెక్క వేయవచ్చు. ఇంతకీ ఈ సిండ్రోమ్ దెబ్బ ఎలా ఉంటుందంటే మొదటి సినిమాతో కమర్షియల్ లేదా ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు ఎవరైనా సరే సరే ఈ సిండ్రోమ్ పుణ్యమా అని సెకండ్ సినిమాతో దారుణమైన ఫ్లాప్ అందుకుంటాడు. ఇలా సెకండ్ సినిమాతో సూపర్ ఫ్లాప్ అందుకొని మూలనపడ్డ దర్శకుల సంఖ్య చాలా పెద్దది. అయిది అదృష్టమో కష్ట ఫలమో కానీ ఇప్పుడా సిండ్రోమ్ నుండి ఇద్దరు కుర్ర దర్శకులు బయట పడ్డారు. అంతే కాదు రెండో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. వారే మజిలీ, జెర్సీ సినిమాల దర్శకులు శివ నిర్వాణ, గౌతంలు.  మొదటి మూవీ నిన్నుకోరితో హిట్ కొట్టాడు శివ దీంతో ఈయన తీసిన రెండో సినిమాపై అందరూ అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ రెండో సినిమాతో అంతకంటే పెద్ద హిట్ కొట్టాడు. చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇది. ఇక గౌతమ్ తిన్ననూరి కూడా ముందు అసలు సినిమాలే లేని సుమంత్ తో మళ్లీ రావా అనే సినిమా చేశాడు. అది హిట్ అయింది. రెండో ప్రయత్నంగా నానితో జెర్సీ సినిమా చేశాడు. ఈ సినిమాతో ఈ సిండ్రోమ్ బారిన పడకుండా బయట పడ్డాడు.

More Related Stories