English   

దర్బార్ లోకి హీరోయిన్ అడుగుపెట్టింది 

Nayanthara
2019-04-23 11:38:55

రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' చిత్రం రూపొందుతోంది. రజనీ 167వ సినిమాగా ఇటీవలే ఈ సినిమా పూజాదికాలు ముగించుకుని సెట్స్ పైకి వెళ్లింది. ఇన్నిరోజులూ రజనీకాంత్ అండ్ కో మీద కొన్ని రోజుల పాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా షూటింగులో ఈ రోజున నయనతార జాయిన్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా సినిమా యూనిట్ ప్రకటించింది. లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా ఈరోజు దర్బార్ షూట్ లో నయనతార జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ ఒక ప్రకటన చేసింది. రజనీ సరసన నయనతార నటించి చాలాకాలమే అయింది. అందువలన ఈ కాంబినేషన్ పై ప్రేక్షకులు ఆసక్తిగా వున్నారు. ఈ సినిమాలో రజనీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని అంటున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Related Stories