English   

కల్కి సినిమాకి అంత సీనుందా ?

 Kalki
2019-04-23 13:00:04

'ఆ' సినిమా సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న ప్రశాంత్ వర్మ, గరుడవేగ సక్సెస్ తో ఫాంలో ఉన్న రాజశేఖర్ లు కలిసి చేస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న ఆదా శర్మ నాయికగా న‌టిస్తోంది. ఈ సినిమా మీద మొదటి నుండి పెద్దగా అంచనాలు ఏమీ లేవు కానీ ఈ మధ్య వచ్చిన టీజర్, ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఈ సినిమా కంటెంట్ చాలా వైవిధ్యభరితమైనదనే విషయాన్ని ఆ టీజర్ చాటి చెప్పగలిగింది. ఈ టీజర్ తో ప్రపంచ వ్యాప్త థియేటర్ రైట్స్ విషయంలో పోటీ ఏర్పడింది. ఈ సినిమా బాగా నచ్చడం వలన థియేటర్ రైట్స్ కొనుగోలుతో తెలుగులోను తన వండర్ బార్ సంస్థను విస్తరించాలని తమిళ హీరో ధనుశ్ భావించాడట. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ కి గాను ఆయన భారీ రేటుని ఆఫర్ చేశాడట. అయితే అప్పటికే ఈ సినిమా థియేటర్ రైట్స్ ను నిర్మాత రాధామోహన్ 12 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.  రాధా మోహన్ తో అగ్రిమెంట్ జరిగిపోయాక ఈ నిర్మాతలను ధనుష్ మనుషులు కలిశారని సమాచారం.

More Related Stories