English   

జెర్సీ ఊపుతో మరో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న నాని 

Nani
2019-04-23 13:36:48

నాని గతంలో చేసిన రెండు సినిమాలు నిరాశ పరచడంతో అయన నటన మీద ద్రుష్టి పెట్టాడు. తాజాగా ఆయన జెర్సీ సినిమాతో విజయం అందుకున్నాడు. తాజాగా ఆయన మరో సినిమాని నిర్మించే పనిలో ఉన్నాడని సమాచారం. నిజానికి గతంలో నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో 'ఆ' సినిమా నిర్మితం అయి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఉత్సాహంతో మరిన్ని సినిమాలు నిర్మిద్దమనుకున్నా నటనా పరంగా హిట్ లు పడకపోవడంతో దాని మీద ద్రుష్టి పెట్టి హిట్ కొట్టాడు. దీంతో ఇప్పుడు వైజయంతి మూవీస్ అశ్వనీదత్ తనయ, నిర్మాత స్వప్న దత్ సంయుక్తంగా ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ని నిర్మించనున్నారని అంటున్నారు. ఈ మూవీ లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, షాలిని పాండే మెయిన్ లీడ్స్ గా గతంలో పిట్టగోడ మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తారని అంటున్నారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించాలసి ఉంది.

More Related Stories