English   

సాయి ధరమ్‌ తేజ్‌ నెక్స్ట్ మారుతితోనేనా ?

Sai Dharam
2019-04-23 16:49:58

అరడజను ఫ్లాపుల తర్వాత హిట్టు పడితే ఎలా ఉంటుందో ఆ కిక్కుని ఎంజాయ్ చేస్తున్నాడు ధరమ్ తేజ్. ఎట్టకేలకు 'చిత్రలహరి' సినిమాతో ఊపిరి పీల్చుకున్నాడు ధరమ్‌ తేజ్‌. పేరు మార్చుకుంటే తప్ప లక్కు కలిసిరాలేదేమో కానీ సాయి ధరమ్‌ తేజ్‌ కాస్తా 'చిత్రలహరి' కోసం సాయి తేజ్‌ గా మారి మరీ హిట్టు కొట్టాడు.  ఇదిలా వుంటే, తన తదుపరి సినిమాని మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే మారుతి తీసిన అన్ని సినిమాలు హిట్ కొట్టాడు, అయినా ఇప్పుడు మారుతితో సినిమా అంటే టెన్షన్లో ఉన్నాడట తేజు. ఎందుకటే మరుతిది కమర్షియల్‌ ఫార్ములా. అలా కమర్షియల్ యాంగిల్ కి దూరంగా వెళ్లడం వల్లే చిత్రలహరి ఆడిందని అనుకుంటూ వుంటే మళ్లీ ఇప్పుడు ఫార్ములా సినిమా చేయాలా అనేది సాయి తేజ్‌ ఆలోచన. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories