English   

మెగా హీరోకి స్వీట్ షాక్ ఇచ్చిన అభిమానులు !

charan
2019-04-23 17:36:57

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు ఖండాంతరాల వరాకూ విస్తరించారు. అదేంటా అనుకుంటున్నారా ? ఈ మెగా హీరో జపాన్ అభిమానుల నుండి సర్‌ప్రైజ్ అందుకున్నాడు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా, జపాన్‌లోని ఆయన అభిమానులు మగధీర సినిమాలోని చరణ్ క్యెరెక్టర్స్‌కి సంబంధించిన రకరకాల ఇమేజెస్‌ని గ్రీటింగ్ కార్డ్స్‌పై ప్రింట్ చేసి, పోస్ట్ ద్వారా చెర్రీకి పంపించారట. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 50 మంది అభిమానులు ఇలా గ్రీటింగ్స్ పంపారు. చరణ్ ఈ గ్రీటింగ్‌ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ జపాన్‌ నుంచి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ను అందుకున్నాను. నా పట్ల మీకున్న ప్రేమానురాగాలు నన్నెంతో సంతోషపరిచాయి. నా జపాన్‌ అభిమానులకు ప్రేమను పంపుతున్నాను. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. థాంక్యూ జపాన్‌’ అని పోస్ట్ చేశాడు. మగధీర జపాన్‌లో రిలీజ్ అయ్యి, అక్కడ కూడా హిట్ అయ్యింది. 

More Related Stories