English   

నాని గ్యాంగ్ లీడర్ లో ఆ రోల్ చేస్తున్నాడా ?

 Nani
2019-04-23 18:15:28

వరుస ఫ్లాపులతో డీలా పడ్డ నానికి కొత్త ఊపు తెచ్చింది జెర్సీ సినిమా, సినిమా చుసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుందనే మాట తప్ప మరో మాట అనకపోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు నాని. అయితే నాని హీరోగా విక్రం కుమార్ దైరేకషణ్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని పాత్ర ఇదే నంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాని ప్రకారం విక్రం కుమార్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని ఒక రచయిత పాత్ర పోషిస్తున్నాడట. నాని జీవితంతో సంబంధం ఉండేలా మరో ఐదు అమ్మాయిల పాత్రలు ఉంటాట. మరోపక్క బ్యాంకు రాబరీతో మొదలయ్యే ఈ సినిమాలో కరుడుగట్టిన దొంగగా ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కనిపిస్తాడు. కార్తికేయనే కాకుండా ఈ సినిమాలో మరో విలన్ కూడా ఉన్నాడట. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయాల్లో నిజం ఎంతుందో ? సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం.

More Related Stories