English   

నువ్వు తోపురా ట్రైలర్ రివ్యూ !

Nuvvu Thopu Raa
2019-04-23 18:21:35

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ నాగరాజు అదేనండీ సుధాకర్ కోమాకుల హీరోగా, నువ్వు తోపురా అనే సినిమా రాబోతుంది. నిత్య హీరోయిన్ గా హరిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోందీ సినిమా. ఈ సినిమా ఈ ఏడాది మే 3న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా మూవీ ట్రైలర్ ను ఇవాళ హీరో ప్రభాస్ చేతులమీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ని బట్టి చూస్తేఇది  పక్కా తెలంగాణా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే సినిమాలా ఉంది. అలాగే హైదరబాద్ ను  అమెరికాతో కనెక్ట్ చేసిన తీరు కూడా బాగుంది. జీవితంలో రాజీ పడడం, ఏ విషయంలోనూ ఒంగి ఉండడం తెలియని ఒక కుర్రాడు, జాబ్ కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, తన క్యారెక్టర్ మార్చుకున్నాడా? ప్రేమని దక్కించుకున్నాడా, లేదా అనే పాయింట్స్‌తో, నువ్వు తోపురా రూపొందుతుందని ట్రైలర్ ని బట్టి చూస్తే తెలుస్తుంది. సుధాకర్ యాక్టింగ్, హీరోయిన్‌తో అతని కెమిస్ట్రీ బాగుంది. మరి ఈ సినిమా ఏమి చేయనుందో వేచి చూడాలి.

More Related Stories