English   

దిల్ రాజుని మునగచెట్టు ఎక్కించిన నాని

nani
2019-04-23 20:16:50

తాజాగా జెర్సీ సినిమాతో హిట్ కొట్టిన నాని నిన్న దిల్ రాజుని అభినందనలతో ముంచెత్తాడు, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన జెర్సీ సినిమా శుక్రవారం విడుదలై అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్, గౌతమ్ తిన్ననూరి, చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలో నానికి కొడుకుగా నటించిన తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ఈ క‌థ విన్న‌ప్పుడే అద్భుతంగా అనిపించిందని, సినిమాలో అర్జున్‌కి బీసీసీఐ ఈవెంట్ ప్లాన్ చేసిన‌ట్టు, దిల్‌రాజుగారు అప్రిషియేష‌న్ మీట్‌ను ఏర్పాటు చేశారని, సినిమా ఉద‌యం ఆట చూసి దిల్‌రాజుగారు ఫోన్ చేశారంటేనే సినిమా హిట్ అయిన‌ట్టని ఈ సినిమాకు కూడా ఉద‌యం ఇంటి గేటు నుంచి అడుగు బ‌య‌ట‌పెడుతుంటే దిల్‌రాజుగారు ఫోన్ చేశారు. నాకు క్లారిటీ వ‌చ్చిందని చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంద‌రికీ థాంక్స్ చెప్పానని, గౌత‌మ్ స్వ‌త‌హాగా చాలా హానెస్ట్ గా ఉన్నాడు. బిగినింగ్ నుంచి ఇప్ప‌టిదాకా అలాగే ఉన్నాడు. `గౌత‌మ్ చాలా పెద్ద డైర‌క్ట‌ర్ అవుతాడు` అని ఆయన చెప్పుకొచ్చారు. 

More Related Stories