English   

అట్లీ మీద లేడీ జూనియర్ ఆర్టిస్ట్ సంచలన ఆరోపణలు

attle
2019-04-23 20:56:22

కోలివుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు అట్లీపై ఒక జూనియర్‌ నటి సంచలన ఆరోపణలు చేసి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. అట్లీ ప్రస్తుతం దళపతి విజయ్‌ 63వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా దర్శకుడు అట్లీ తనను దారుణంగా దూషించారని, అసభ్యంగా, అశ్లీలంగా ఆయన దూషణలు ఉన్నాయని జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణ కుమారి అనే ఆవిడ చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అట్లీ తనను కుక్క కంటే హీనంగా చూసేవాడని ఆమె  మీడియా ముందు సంచలన విమర్శలు చేశారు. ఏప్రిల్‌ 13న షూటింగ్‌ సెట్‌లో తనను అట్లీ ఘోరంగా దూషించాడని, అయినా ఎన్నికలు ఉండటం, ప్రభుత్వ సెలవులు ఉండటంతో ఈ విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదని ఆమె చెప్పడం గమనార్హం. రాజా-రాణి, తెరి, మెర్సల్‌ లాంటి విజయవంతమైన సినిమాలతో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన అట్లీపై ఈరకమైన ఆరోపణలు రావడం తమిళ చిత్రసీమలో సంచలనం రేపుతోంది.

 

More Related Stories