English   

మహేష్ దున్నేస్తాడా

mb
2019-04-24 08:15:16

వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’.  సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా  నటించిన ఈ సినిమా మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకూ కాలేజ్ కుర్రాడిలా, బిజినెస్ మ్యాన్ లో దర్శనమిచ్చిన మహేష్ బాబు తాజాగా స్టిల్ లో రైతు అవతారం ఎత్తాడు.. ఎడ్లను కట్టి పొలాన్ని దున్నుతున్న మహేష్ మోడ్రన్ రైతులా కనిపిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ పై కాలేజీ స్టూడెంట్ పోస్టర్స్, బిజినెస్ మ్యాన్ పోస్టర్స్ విడుదల కాగా మహేష్  దుక్కి దున్నుతున్న పిక్ వైరల్ అవుతోంది.  అయితే ఈరైతు లుక్ ను ముఖ్యంగా మహేష్ తలపాగాను చూస్తే ఎవరికైనా వెంటనే ‘భరత్ అనే నేను’ మూవీలో ఒక పాటలోని మహేష్ తలపాగా గుర్తుకు వస్తుంది. అయితే మహేష్ బ్రహ్మోత్సవం సెంటిమెంట్ ని గృతు చేసుకుని టెన్షన్ పడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. దీంతో మహేష్ ఈ సినిమాతో దున్నేస్తాడా ? అనే అనుమానాలు మొదలయ్యాయి.

More Related Stories