English   

అప్పుడు హీరోయిన్ ఇప్పుడు విలనయ్యింది 

alluarjun
2019-04-24 08:44:44

అల్లు అర్జున్ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన దేశ‌ముదురు సినిమాతో హీరోయిన్‌గా త‌న కెరీర్‌ను మొద‌లుపెట్టింది అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న  హ‌న్సిక. తెలుగులో కొన్ని సినిమాల్లో ఆమె తర్వాతి రోజుల్లో న‌టించిన‌ప్ప‌టికి హిట్స్ పెద్దగ ద‌క్క‌క‌పోవ‌డంతో తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. అక్క‌డ వ‌రస సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డంతో కోలీవుడ్‌లో నెం1 హీరోయిన్‌గా ఎదిగింది. మళ్ళీ ఆమెకి కష్ట కాలంవచ్చిందో ఏమో గ‌త కొంత‌కాలంగా హ‌న్సిక‌కు కోలీవుడ్‌ లో కూడా స‌రైన హిట్లు దక్కడం లేదు. దీంతో ఎలాంటి రోల్స్‌లో అయిన న‌టించ‌డానికి ఆమె సిద్దపడింది. అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న కొత్త సినిమాలో నెగిటివ్ రోల్లో క‌నిపించ‌నుంద‌ని వార్తలు వస్తున్నాయి. అవడానికి నెగటివ్ రోల్ అయినా సినిమాలో ఈ పాత్ర చాలా కీల‌కం అని అంటున్నారు. అయితే ఈ సినిమా విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఒక‌ప్పుడు అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన హ‌న్పిక‌, ఇప్పుడు అదే హీరోకి విల‌న్‌ గా నటించడం అనేది ఆసక్తికరమే.

More Related Stories