English   

సూత్రధార్ వర్మ అరెస్ట్ !

 Sutradhar
2019-04-24 11:51:26

నటన నేర్పాలంటే ఒంటిపై బట్టలన్నీ విప్పాలని ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’ ట్యూటర్ డైరెక్టర్ వినయ్ వర్మపై విద్యార్థిని అచింత కౌర్ చద్దా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినయ్ వర్మపై నిర్భయ యాక్ట్ కింద లీసులు అరెస్ట్ చేశారు. నటన నేర్చుకోవాలంటూ బట్టలు విప్పేయాలంటూ వేధించాడని ఓ యువతి ఈ నేల 17న ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు వినయ్ వర్మపై 354 A (నిర్భయ యాక్ట్) 506, 509 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఆరోపణలు నిజమేనని తేల్చారు. నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. అయితే ఈ కేసు మీద వినయ్ వర్మ స్పందించారు. యువతిని బట్టలు తీయమన్నది నిజమే కానీ  పై దుస్తులు మాత్రమే తీయమన్నానని అన్నారు. 20 ఏళ్ల నుంచి ఎంతోమందిని హీరో, హీరోయిన్లు, నటులుగా తీర్చిదిద్దానన్నారు. తన శిష్యులు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పుకొచ్చారు.

More Related Stories