English   

ప్రభాస్ కి హైకోర్టు ఊరట...కానీ 

 Prabhas
2019-04-24 15:33:52

హీరో ప్రభాస్‌కు చెందిన భూవివాదంలో నిన్న హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం పన్మక్త గ్రామంలో ప్రభాస్ కొనుగోలు చేసిన భూమి నుంచి ప్రభుత్వం ఆయనను ఖాళీ చేయిండం చట్ట వ్యతిరేమని ప్రకటించింది. ప్రభాస్ కొనుగోలు చేసుకున్న భూమిని క్రమబద్ధీకరించాలని చేసుకున్న దరఖాస్తు మీద ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, తామిస్తున్న ఈ ఉత్తర్వుల కాపీ అందిన ఎనిమిది వారాల్లోగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.  ఒకవేళ ప్రభుత్వం దరఖాస్తును తిరస్కరిస్తే, ప్రభాస్ మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. అదే ప్రాంతంలోని భూమి 60 ఏండ్లుగా వివాదం ఉన్నందున ప్రభాస్‌ కి భూమిని స్వాధీనం చేయాలని ఉత్తర్వులు ఇవ్వలేకపోతున్నామని హైకోర్టు ప్రకటించింది.

More Related Stories