English   

ఆవును ఆ జంట విడిపోయారు

Harshvardhan Rane
2019-04-24 16:39:47

టాలీవుడ్ లో అవును, 'అనామిక', 'ఫిదా' వంటి సినిమాల్లో నటించిన హర్షవర్ధన్ రానే ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ తనకంటే నాలుగేళ్లు పెద్దదైన కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో వీరిద్దరి జంట హాట్ టాపిక్. రిలేషన్ లో ఉన్నప్పుడు ఈ జంట ఎప్పుడూ తమ బంధాన్ని దాచాలని అనుకోలేదు. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. అయితే గత నెలలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ అవడంతో ఒకరితో మరొకరికి పడడం లేదట. దీంతో బ్రేకప్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని హర్షవర్ధన్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. కిమ్ శర్మని 'కె' అంటూ సంభోదిస్తూ ఆమెకు ఒక లేఖ రాశాడు. ''కె.. థాంక్యూ జెంటిల్ సోల్.. నీతో కలిసి ఉన్నప్పుడు అధ్బుతంగా అనిపించింది. నీకు ఆ దేవుడు దీవెనలు ఉండాలి..అలాగే నాకు కూడా'' అంటూ రాసుకొచ్చాడు. కిమ్ శర్మ కూడా తెలుగులో.. 'ఖడ్గం', 'మగధీర' వంటి  చిత్రాలలో మెరిసిన సంగతి తెలిసిందే.  

More Related Stories