English   

ఆదరకోడుతున్న పదరా పదరా పదరా సాంగ్

Maharishi
2019-04-24 17:15:44

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ ‘మహర్షి’ మే 9 రిలీజ్ కానుందన్న సంగతి తెలిసిందే.  దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఛోటీ ఛోటీ బాతే’.. ‘నువ్వే సమస్తం’  అంటూ సాగే  లిరికల్ సాంగ్స్.. ‘ఎవరెస్ట్ అంచున’ అంటూ సాగే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేసిన సినిమా యూనిట్ ఈరోజు ఈ సినిమానుండి మరో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాట పదరా పదరా అంటూ సాగుతుంది.  “పదరా పదరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా” అంటూ స్ఫూర్తి రగిలించే విధంగా ఉండే పదాలతో సాగుతున్న ఈ సంగ్ కి శ్రీమణి సాహిత్యం అందించాడు. ఈ పాటలో తలపాగా చుట్టి నాగలిపట్టి పొలం దున్నుతూ మహేశ్ బాబు కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం శ్రీమణి సాహిత్యం శంకర్ మహదేవన్ ఆగొంతు మూడూ కలిపి ఆకట్టుకునేలా వున్నాయి. ఇంతకుముందు వదిలిన 3 పాటలకు ఓ మాదిరి రెస్పాన్స్ ఉండటంతో, ఈ పాటపైనే ఈ సినిమా టీమ్ ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలను ఈ పాట నెరవేర్చేలానే అనిపించింది. మీరు కూడా వినండి మరి.

More Related Stories