English   

అల్లు వారి సినిమా మొదలయ్యింది

alluarjun
2019-04-24 19:57:20

గతేడాది వచ్చిన  ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ డిజాస్టర్ తో అల్లు వారబ్బాయి ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఎట్టకేలకి ఆయన త్రివిక్రమ్ సినిమా ఈరోజు సెట్స్ మీదకి తెచ్చారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈరోజు నుంచి జరగబోతోంది. ఈ విషయాన్ని యూనిట్ ట్విటర్‌ వేదికగా ప్రకటించి త్రివిక్రమ్‌, బన్నీకి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోని పోస్ట్‌ చేశారు. జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. హీరోగా అల్లు అర్జున్‌కు ఇది 19వ సినిమా. ఈ  మూవీలో అల్లు అర్జున్ జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు టబు అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ‘అలకనంద’ అనే పేరును పరిశీలిస్తున్నారు. బన్నీ, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ‘దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రంలో నటించారు.

 

More Related Stories