English   

కోడ్ దెబ్బ....సినీ పురస్కారాల మీద కూడా 

nationalawards
2019-04-25 08:01:11

ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఈ ఏడాది జాతీయ సినీ పురస్కారాల ప్రకటన ఆలస్యం కానుంది. ఎన్నికల కోడ్‌ కారణంగా  మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే 66వ జాతీయ సినీ అవార్డుల విజేతల్ని ప్రకటించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నందున దేశం మొత్తం ఎన్నికల కోడ్ ఉంటుంది, ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ఏ పనీ ప్రభుత్వం చేయకూదు. అదీ కాక ఈ ఎన్నికల్లో అనేక మంది సినీ ప్రముఖులు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నేపధ్యంలో ఎన్నికల తర్వాతే ఈ అవార్డులను ప్రకటించనున్నారు.  ప్రతిసారి ఏప్రిల్ నెలలో విజేతల్ని ప్రకటించి మే మొదటి వారంలో అవార్డుల ప్రధానోత్సవం ఉండేది.  ఈ సారి మే చివరిల్లో ప్రకటించి జూన్ లో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.  

More Related Stories