English   

పెళ్లి హడావిడిలో సమంత

samantha
2019-04-25 08:26:58

మజిలీతో హిట్ కొట్టి ఫాంలో ఉన్న సమంత తన స్నేహితురాలి పెళ్లిలో మెరిసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంతా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్రైస్తవ వివాహ వేడుకలో భాగంగా దిగిన ఫొటోల్ని షేర్‌ చేశారు. పెళ్లి కుమార్తె అయిన తన స్నేహితురాలికి శుభాకాంక్షలు చెప్పిన శామ్ ఆమె మనసు ఎంతో మంచిదని పేర్కొంది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్నేహితులు వీరేనంటూ ఒక గ్రూప్‌ ఫొటోని  షేర్‌ చేసింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి కుమార్తె తెలుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోతుండగా సామ్‌తో పాటు ఆమె స్నేహితులు అందరూ మాత్రం నీలి రంగు వస్త్రాల్లో కనిపించారు. వారిలో ఎవరో జోక్ చేశారనుకుంటా శామ్ పగలబడి నవ్వుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అవుతున్నాయి. మరో పక్క తమిళ హిట్‌ '96' తెలుగు రీమేక్‌ లో కూడా శామ్‌ నటిస్తోంది.  

More Related Stories