English   

తన రికార్డు తానే బద్దలుకొట్టనున్న నాని

Nani
2019-04-25 10:00:23

నేచురల్ స్టార్ నాని మరోసారి తన సత్తా చాటాడు. జెర్సీ సినిమాలో తన సహజసిద్ధమైన నటన, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన క్రికెట్ బేస్డ్ సినిమాకి మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా యూఎస్‌ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా అక్కడ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా అమెరికా ప్రీమియర్‌ లో 144,687 డాలర్లు, తొలి రోజున 262,732 డాలర్లు, రెండో రోజున 325,923 డాలర్లు, మూడో రోజున 179,391 డాలర్లు, నాలుగో రోజున 43,381 డాలర్లు, ఐదో రోజున 43,220 డాలర్లు మొత్తం 1,000,025 డాలర్లు రాబట్టినట్లు సమాచారం. యూఎస్‌లో నానికి ఇది ఆరో మిలియన్ డాలర్ల మూవీ కాగా వాటిలో అత్యధికంగా ‘భలే భలే మగాడివోయ్’ సినిమా 1.43 మిలియన్ డాలర్లను యూఎస్‌లో వసూలు చేసింది. ఈ సంఖ్యను ‘జెర్సీ’ దాటేసే అవకాశం స్పష్టం కనిపిస్తోంది.  

More Related Stories