English   

వినాయక్ షాకింగ్ డెసిషన్...నిజమేనా ?

Vinayak
2019-04-25 11:14:05

కొద్ది కాలం క్రితం వరకు తెలుగులోని అగ్ర దర్శకుల్లో ఆయన ముఖ్యులు. ఏ హీరోని అడిగినా సెకన్లలో డేట్స్ ఇచ్చే వారు కానీ ఇప్పుడు ఏ హీరో తనకు అవకాశం ఇస్తాడా అని ఎదురు చూపుల్లో ఉన్నారు. ఆయనే వి.వి. వినాయక్. గతేడాది వచ్చిన ‘ఇంటిలిజెంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో ఒక్కసారిగా ఆయన రేసులోంచి లేకుండాపోయారు. ఇప్పటివరకు ఆయన సినిమానీ మొదలుపెట్టలేదు. నిజానికి 2018 జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన 104వ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తారని నిర్మాత సి. కల్యాణ్ ప్రకటించారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన పోస్టర్‌నూ విడుదల చేశారు. కానీ బాలయ్య ఆ సినిమాని పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఒకటి కలకలం రేపుతోంది. దాని ప్రకారం వీవీ వినాయక్ డైరెక్షన్ కి రిటైర్మెంట్ ఇస్తున్నారట. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ఈ న్యూస్ కూడా సంచలనం అవుతోంది. 

More Related Stories