English   

అవెంజేర్స్ కి తమిళ్ రాకర్స్ దెబ్బ...ఆన్ లైన్ లో పైరసీ ప్రింట్ 

Avengers
2019-04-25 12:25:45

ఇప్పుడు తెలుగు సహా నాలుగు ప్రధాన బాషల సినిమా ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సినిమా అవెంజేర్స్ ది ఎండ్ గేం, తెలుగులో అయితే బాహుబలిని మించి క్రేజ్ ని చూపించి టిక్కెట్ల సేల్ లో నెంబర్ 1 గా నిలిచిన ఈ సినిమాకి ఈనెల 26న దేశంలో మొత్తం 2,500 స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఓ హాలీవుడ్ చిత్రం దేశంలో ఇన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల కావడం ఇదే తొలిసారి. ఇప్పటికే టికెట్లు అమ్ముడయి పోయాయి. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్‌లో చూస్తామా అని అవెంజర్స్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘అవెంజర్స్’కు తమిళ్‌రాకర్స్ షాక్ ఇచ్చారు. విడుదలకు రెండు రోజుల ముందే మొత్తం సినిమాను ఆన్‌లైన్‌లో లీక్ చేసేశారు. ఎలా అంటే ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఈనెల 24న జర్మనీ, యూఏఈ, సింగపూర్‌తో పాటు ఇతర దేశాల్లో విడుదలైంది. దీంతో అక్కడ ఎక్కడో సినిమాని పైరసీ చేసి రెండు రోజుల ముందే మొత్తం సినిమాను తమిళ్‌రాకర్స్ ఆన్‌లైన్‌లో పెట్టేశారు. దీంతో ఇప్పుడు ఇండియాలో సినిమా తీసుకున్న నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. 

More Related Stories