English   

గోపీచంద్ ని కాపీకోడుతున్న మహేష్ బాబు

Mahesh
2019-04-25 13:36:27

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా మహర్షి. ఆయన సినీ జీవితంలో మెయిలు రాయి లాంటి 25వ సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకి సంబంధించి అన్నీ భారీగా చేస్తూన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ మే 1న నెక్లెస్ రోడ్- పీపుల్స్ ప్లాజాలో ప్లాన్ చేశారు. మే1 కార్మికల దినోత్సవం సెలవు రోజు కాబట్టి మహేష్ అభిమానులు ఈ వేడుకకు భారీగా తరలి వచ్చే వీలుందని అందుకే అంత పెద్ద స్థలంలో ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లు ఎప్పటిలాగే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఉంటారట. అదీ కాక మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇప్పటివరకూ మహేశ్ బాబు చేసిన 24 సినిమాలకి సంబంధించిన దర్శకులు ఆయన గురించి చెప్పే వీడియో ఒకటి ప్లే చేస్తారట. అలాగే ఆ దర్శకులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించి సన్మానం చేస్తారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో గోపీచంద్ కూడా తన 25సినిమా పంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే చేశాడు, ఇప్పుడు మహేష్ గోపీ చాంద్ ని కాపీ కొట్టబోతున్నాడన్న మాట. 

More Related Stories