English   

అర్జున్ సురవరం మహర్షి వెనకేనట 

Arjun Suravaram
2019-04-25 15:31:39

అనుకున్నదే అయ్యింది, అర్జున్ సురవరం మూవీ వాయిదా పడింది. నిఖిల్ కథానాయకుడిగా సంతోష్ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా అర్జున్ సురవరం టైటిల్ తో రిలీజ్ కావాల్సి ఉంది.  2016లో తమిళంలో వచ్చిన 'కణితన్' కి రీమేక్. అక్కడ ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, అదే దర్శకుడితో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేశారు. ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా టైటిల్ విషయంలో ఇబ్బందులు రావడం వలన  మే1న రిలీజ్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేయగా హాలీవుడ్ నుండి వస్తున్న అవెంజర్స్‌ రేపు భారీగా విడుదల కానుండటంతో ఆ సినిమా దాటిని తట్టుకోలేక ‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. అలాగే సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఏసియన్ సినిమాస్ కూడా ఈ విషయం మీద స్పందించింది, మహర్షి రిలీజ్ అయ్యాక మంచి రోజు చూసి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చింది. మరోపక్క సినిమా హీర్రో నిఖిల్ కూడా క్షమాపణలు చెబుతూ పోస్ట్‌ షేర్ చేశారు.. అయన రాసిన పోస్ట్ యధాతధంగా ‘ఒక సంవత్సరం గ్యాప్.. మంచి సినిమాతో ఒక మంచి పాయింట్‌తో నాతో పాటు చాలా మంది టెక్నీషియన్స్ చాలా కష్టపడి కార్మిక దినోత్సవం రోజు మీ అందరి అభిమానం కోసం రావడానికి ఎదురుచూస్తున్న టైమ్‌లో అవేంజెర్స్ లాంటి ఎదురుదెబ్బ.. ఎలా ఐతే అవెంజర్స్ ధానోస్‌ని ఎదిరించి ప్రపంచం కోసం పోరాడుతారో.. అర్జున్ సురవరం కూడా స్టూడెంట్స్ కోసం పోరాడతాడు. ఇలాంటి ఒక పాయింట్ ఉన్న సినిమాని చూసి నచ్చి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు వాయిదా వేస్తున్నాం.  ఇది నాకు బాధాకరం అయినప్పటికీ డబ్బులు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. వారిచ్చే మరో గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం మీలాగే నేను వేచిచూస్తున్నా. ఇలాంటి సమయంలో మీ తోడ్పాటు నాకు అత్యవసరం.. ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నాను.. మీ నిఖిల్’ అంటూ ట్వీట్ చేశారు నిఖిల్. 

More Related Stories