English   

పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్న బాలీవుడ్ హీరో.. ! 

Arjun Rampal
2019-04-25 16:57:27

తండ్రికావాలంటే పద్దతిగా పెళ్లి చేసుకుని భార్య ద్వారా కావాలి...లేదంటే ఎవరైనా దత్తత తీసుకున్నా తండ్రి కావచ్చు. కాని మన బాలీవుడ్ హీరోలకి అవేమీ అక్కర్లేదు. ఒక ఆడ ఒక మగ ఉంటే చాలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే గత ఏడాది భార్యకు విడాకులు ఇచ్చి 22 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిన బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్. వెంటనే సౌత్ ఆఫ్రికా బ్యూటీ గాబ్రియాలాతో సహజీవనం సాగించడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే, ఇప్పుడు ఆయన ఆమె వలన తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేశాడు. గాబ్రియాలా గర్బంతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లుగా ప్రకటించాడు. 45 ఏళ్ల అర్జున్ రాంపాల్ మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. వారిలో పెద్ద అమ్మాయి త్వరలో బాలీవుడ్ తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా ఒక సినిమా కూడా మొదలై షూటింగ్ కూడా జరుగుతోంది. కూతురు హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సమయంలో అర్జున్ రాంపాల్ మరోసారి తండ్రి కాబోతుండటం కాస్త చర్చనీయాంశంగా మారింది.

More Related Stories