English   

అవెంజేర్స్ మొదటి రోజు కలెక్షన్లు వామ్మో ?

Avengers
2019-04-25 18:16:42

ప్రస్తుతం థియేటర్స్‌లో మజిలీ, చిత్రలహరి చిత్రాలతో పాటు నాని తాజా సినిమా ‘జెర్సీ’ మూవీ విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. ఇప్పుడు అవేంజర్స్ సుమారు 500 థియేటర్స్‌లో భారీగా విడుదలవుతుంది. ఈ చిత్రానికి క్రేజ్ ఏం రేంజ్‌లో ఉందంటే ఆన్ లైన్‌లో టిక్కెట్స్ పెట్టిన అరగంటలోనే టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కొన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘జెర్సీ’ చిత్రాన్ని సైతం తీసేని ‘అవేంజర్స్’ సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.  దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ మీద అంచనాలు పెరుతున్నాయి, నిజానికి తెలుగులో ఒక్క బాహుబలికి మాత్రమే ఇంత క్రేజ్ వచ్చింది ఇప్పటి వరకూ ఆప్పుడు అదే సీన్ అవెంజర్స్ విషయం లో కనబడుతుంది. ఇప్పుడు అవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇండియన్ సినిమా హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ అవచ్చని అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్లు. తొలిరోజు బుకింగ్స్ ని చూసి సినిమా 45 కోట్ల దాకా వసూళ్ళ ని అందుకోవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాహుబలి మొదటి రోజు 42 కోట్లు సాధించింది, ఇప్పుడు ఈ సినిమా అది దాటితే ఇదే మొదట నిలిచే అవకాశం కనిపిస్తోంది.  

More Related Stories