English   

బాలయ్య తర్వాత సినిమా బోయపాటితో కాదట

nbk
2019-04-25 20:37:39

ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర‌వాత‌ నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా బోయ‌పాటి శ్రీ‌నుతోనే అని బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ప్రకటించారు. అయితే వినయ విదేయ రామ డిజాస్టర్ తర్వాత బోయపాటితో సినిమా అంటే బాలయ్య ఫ్యాన్స్ కాస్త భయపడ్డారు. ఆయనతో సినిమా అంటే మళ్ళీ రిజల్ట్ ఎలా ఉంటుందో ? అని. అయితే వారికి ఊరట ఇచ్చేలాగా బాలయ్య బోయపాటి కంటే ముందు మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడని అంటున్నారు. ఈ చిత్రానికి జై సింహా తెరకెక్కించిన కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారని టాక్. జై సింహ తెరకెక్కించిన సి.కల్యాణ్ ఈ సినిమాని కూడా తెరకేక్కిన్చానున్నాడట. మేలో ఈసినిమాని మొద‌లెట్టి, ఆగ‌స్టు నాటికి పూర్తి చేయాల‌ని భావిస్తున్నారట. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుందని అంటున్నారు.
 

More Related Stories