English   

మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇద్దరు టాప్ హీరోలు 

mb
2019-04-26 08:18:37

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ సినిమాని మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని దిల్ రాజు, అశ్వినిదత్, పివిపిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి విడుదలైన సాంగ్స్ , ఫస్ట్ లుక్ లు ఎంతోగానో ఆకట్టకుంటున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే1న హైదరాబాద్ లోని పిపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. మహేశ్ నటిస్తున్న 25వ సినిమా మహర్షి కావడంతో ఆయన నటించిన 24సినిమాల దర్శకులను ఈఫంక్షన్ కు ఆహ్వానించనున్నారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా ఎవరూ వస్తారన్నది బయటకు చెప్పలేదు, ఎప్పటిలానే మహేష్ తండ్రి కృష్ణను ఆహ్వానిస్తారు అది వేరే విషయం, అయితే ఈ ప్రీ ఎఇలీజ్ కోసం ఇద్దరు టాప్ హీరోలు వస్తున్నారని టాక్. నిజానికి మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు చాలా దగ్గరి మిత్రులు అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ముఖ్య అతిధులుగా రానున్నారని తెలుస్తుంది. ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.

More Related Stories