English   

ఎన్టీఆర్ కోసం శ్రీ లంక భామ 

jrntr
2019-04-26 08:37:21

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా రెండవ షెడ్యూల్ మొదలయ్యింది, అయితే చరణ్ కి గాయం కావడంతో ఈ సినిమా షూట్ ఆగిందని వార్తలు వచ్చాయి, అయితే చరణ్ గాయం నయమయి అంతా ఓకే అయ్యిందనుకున్న క్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈచిత్రం నుంచి ఎన్టీఆర్ సరసన నటించనున్న హాలీవుడ్ హీరోయిన్ బైసీ ఎడ్గార్ తప్పకుంది. అయితే రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం హీరోయిన్ ను వెతుకుతున్నాడు. వారిలో ముఖ్యంగా శ్రద్దా కపూర్, పరిణితి చోప్రా, నిత్యామీనన్ లో పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు కిక్ చిత్రంలో సల్మాన్ కు జోడిగా నటించిన శ్రీ లంక సంతతి హీరోయిన్ జాక్వేలిన్ ఫెర్నాండేజ్. సినిమాలో అనుకున్న బ్రిటీష్ యువతీ పాత్రకి ఆమె కరెక్ట్ గా సూటవుతుందని జక్కన్న కి రికేమేండ్ చేశాడట సల్మాన్. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.  

More Related Stories