English   

సోషల్ మీడియాలో మరో మైలురాయి అందుకున్న ఎన్టీఆర్

NTR
2019-04-26 11:14:26

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలెబ్రిటీలు తమ అభిమానులతో డైరెక్ట్ గా టచ్ లోకి వచ్చేస్తున్నారు, తెలుగు స్టార్స్ అయితే ఇందులో సిద్దహస్తులు, తమ తమ సినిమాల ప్రమోషన్స్ కి మాత్రమే కాక అనేక రకాలుగా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ఎక్కువ‌గా ట‌చ్‌లో ఉండే టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ తాజాగా అరుదైన మైలురాయి అందుకున్నాడు. రీసెంట్‌గా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఫాలోవ‌ర్స్ సంఖ్య మూడు మిలియ‌న్ల‌కి చేరింది. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబరాల్లో మునిగారు. 2009లో ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఈ పోస్ట్ రాసే నాటికి కూడా 370 ట్వీట్స్ మాత్ర‌మే చేశారు. అయినా ఈ రేంజ్ క్రేజ్ సాదించడం అంటే మామూలు విషయం కాదుగా ? ఇక టాలీవుడ్ హీరో స్‌ విషయానికి వస్తే మ‌హేష్ బాబు 7.6 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌తో తొలి స్థానంలో ఉండ‌గా అల్లు అర్జున్ మూడు మిలయన్ మార్క్ ఈ మధ్యనే 3.09 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ ని సంపాదించాడు. ఇక ఇప్పుడు  మూడు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించిన తారక్ టాలీవుడ్ నుంచి ట్విట్టర్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. దీనిని ఎలా అయినా మొదటి స్థానం లోకి తేవాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారట.

More Related Stories