English   

ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ రివ్యూ 

 Avengers Endgame
2019-04-26 15:47:48

ఒకప్పుడు హాలీవుడ్ సినిమా అంటే పెద్దగా చదువుకున్న వారు సినీ ఆసక్తి ఉన్నవారే చూసే వారు, కానీ అవి కూడా తెలుగులోకి అనువాదం అవడం మొదలయిన నాటి నుండి మన వాళ్ళు కూడా ఆ సినిమాలకు అలవాటు పడ్డారు. అయితే ఆ సినిమాలన్నిటిలో కూడా ఇప్పుడు } ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో అత్యధిక దేశాల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల అయ్యింది. ఇండియాలోనూ బాహుబలి రేంజ్ లో ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవడం ఈసినిమా మీద ఉన్న క్రేజ్ ని తెలుపుతోంది. మరి అంత క్రేజ్ టో రిలీజ్ అయిన ఈ సినిమా ఏమేరకు అలరించింది అనేది రివ్యూలో చూద్దాం.  

కధ :

భూమి మీద నివాసం ఉంటున్న సగం మంది జనాభాని థానోస్‌ నాశనం చేసాక, ఎవెంజర్స్ తమ వాళ్ళను కోల్పోయి ఎవరికి వారుగా విడిపోతారు. ఎవెంజర్స్ లో కొందరు దాదాపు తమ తమ శక్తులను కూడా మరచిపోయి బతుకుతూ ఉంటారు. అయితే ఒకరు తలపెట్టిన ఒక టీం మెషీన్ వ్యవహరం వలన ఎవెంజర్స్ అందరూ కలిసి, చనిపోయిన తమ వాళ్ళను, అలాగే భూమి మీద చనిపోయిన మిగతా సగం జనాభాని బతికించుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం టైం మెషీన్స్ ద్వారా ఆరు శక్తివంతమైన డైమండ్స్ ని సాధించి ఆ పని చేయాలని అనుకుంటారు.  అయితే ఎవెంజర్స్ అందరూ కలిసి ఆ మణులును సాధించారా ? తిరిగి తమ వాళ్ళను బతికించుకున్నారా ? అనేదే ఈ సినిమా. 

విశ్లేషణ :

ఇది ఇక సిరీస్ లో చివరి భాగంగా వచ్చిన సినిమా, సో ఈ సినిమా ముందు వచ్చిన సినిమాలు అన్నీ చూస్తే తప్ప ఈ సినిమా అర్ధం కాదు. మొట్టమొదటగా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది తెలుగు డబ్బింగ్ గురించే, తెలుగులో అనువదించింది ఎవరో కానీ కడుపుబ్బా నవ్వించేలా చేశారు. ఇక సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగింది, ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రతిక్షణం ఉత్కంటగా సినిమాని తెరకెక్కించారు. ఈ విషయంలో డైరెక్టర్స్ ఇద్దరినీ మెచ్చుకోక తప్పదు. సినిమాలో ప్రతి సీన్ ని దర్శకులు చెక్కారని చెప్పవచ్చు, సినిమాలో స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే బోర్ కొట్టించింది, అలాగే ఇది సిరీస్ లో సాగే సినిమా కావడంతో ముందు భాగాలు చూడని వారికి కొంత కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. అయితే పిల్లలు మాత్రం ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. 

నటీనటులు :

ఈ నటీనటులు పెద్దగా మనవాళ్ళకి పరిచయం లేకున్నా వారి పాత్రలు మాత్రం పరిచయమే, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, తొర్, హల్క్ లాంటి పాత్రలలో నటించినవారు తమ తమ పాత్రలలో జీవించారు. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారి వారి పాత్రలను పరిచయం చేసే సీన్స్ కూడా బాగున్నాయి. ఇక ఆ ఆసక్తికరమైన పాత్రల్లో నటించిన స్టార్ నటీ నటులు తమ నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఈ ఎండ్ గేమ్ లో ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. ప్రధానంగా ఒక ఎవెంజర్ చనిపోయిన విధానన్ని తెరకెక్కించిన విధానం ఎమోషనల్ గా అనిపించింది.

చివరిగా : ఎవెంజర్స్ సిరీస్ కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఈ ఎండ్ గేమ్. 

రేటింగ్ : 4 / 5

More Related Stories