English   

పార్టీ అంటే మందు పార్టీనే నట 

 Twinkle Khanna
2019-04-26 17:58:02

బాలీవుడ్‌ నటి, అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి కారణం ఇటీవల అక్షయ్‌ మోదీని ఇంటర్వ్యూ చేయడమే, ఈ ఇంటర్వూలో మోదీ అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ను ఉద్దేశిస్తూ ‘మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటారనుకుంటా. ఎందుకంటే మీ భార్య ఎప్పుడూ నన్ను తిడుతుంటారు కదా..’ అని అక్షయ్‌ తో అన్నారు. ఇందుకు ట్వింకిల్‌ ట్విటర్‌ వేదికగా బదులిస్తూ మోదీ తాను ఉన్నానని గుర్తించడమే ఎక్కువని అయన కామెంట్స్‌ను తాను పాజిటివ్‌గా తీసుకుంటానని అన్నారు. దాంతో ట్వింకిల్‌ భాజపాలో చేరే అవకాశం ఉందని కామెంట్లు వచ్చాయి. దీంతో ఆమె స్పందించక తప్పలేదు. ‘ఎక్కువ కాదు.. తక్కువ కాదు.. స్పందన అనేది ఎప్పుడూ ప్రచారం కిందికి రాదు. నేను చేరే ఏకైక పార్టీలో ఎక్కువగా వోడ్కా(మద్యం) షాట్స్‌ ఉంటాయి. ఆ తర్వాత రోజు హ్యాంగోవర్‌ ఉంటుంది’ అంటూ తనదైన శైలిలో స్పందించింది ఆమె. అంటే తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తన వరకూ పార్టీ అంటే మందు పార్టీనే అనే అర్దం వచ్చేలా ఆమె ట్వీట్ చేసింది.

More Related Stories