English   

మన్మథుడు భలే ప్రమోట్ చేస్తున్నాడే

Manmadhudu 2
2019-04-26 18:41:17

ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2 సినిమాలో నటిస్తున్నారు. నాగార్జున హీరోగా సుమారు పదిహేడేళ్ల క్రితం వచ్చిన ‘మన్మథుడు’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. నాగార్జున కెరీర్‌లో ఇదొక మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. దానికి రెండో భాగంగా ఇప్పుడు ‘మన్మథుడు 2’ను తెరకెక్కిస్తున్నారు. సినిమాని ప్రముఖ నటుడు, చి.ల.సౌ చిత్రంతో డెబ్యూ తోనే తొలి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాని మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌ లో లాంగ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ మూవీ మేకింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు హీరో నాగార్జున. నిజానికి పోర్చుగల్‌ లో నాగార్జున ఫిట్‌నెస్ కోసం చేస్తోన్న కసరత్తులకు సంబంధించిన ఫొటోలు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈసారి మాత్రం నాగార్జున సినిమాలోని వరుస స్టిల్స్ నీ ఒక వీడియోని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జిమ్‌లో రకుల్ ప్రీత్‌తో కలిసి వర్కౌట్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో అది. మొత్తానికి సినిమాని ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు అన్నమాట.

More Related Stories