English   

సందీప్ కిషన్ రెండు సినిమాలు రెండు బాషలు

sundeep
2019-04-26 19:47:30

సందీప్ కిష‌న్ హీరోగా తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో రిలీజ్ అయ్యే లాగా ఒక సినిమా రూపొందుతోంది. 'తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని కామెడీ సినిమాల ఎక్స్పెర్ట్ గా పేరున్న జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు. హ‌న్సిక హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. దాదాపు సగం పైగా ఈ సినిమా షూట్ పూర్త‌యింది. ఇక ఈ సినిమాతో త‌మిళ నటుసు శరత్ బాబు కూతురు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇక ఈ సినిమాకి సాయికార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ నటిస్తున్న మరో సినిమా `నిను వీడ‌ని నీడ‌ను నేనే` పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన అన్య సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మనిషి తన నీడతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుదల కానుంది.  

 

More Related Stories