English   

వెంకీమామతో కలిసి ఓపెనింగ్ చేసిన చైతన్య

venky
2019-04-26 21:24:54

లగ్జరీ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ డుకాటి ఇండియాలో 9వ షోరూమ్‌ను ఈరోజు హైదరాబాద్‌, బంజారా హిల్స్‌ రోడ్‌ నెం. 12లో నూతనంగా ప్రారంభించింది. ఈ షో రూమ్ ప్రారంభోత్సవానికి విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్‌ రిబ్బన్‌ కట్‌ చేసి డుకాటి ఇండియా షోరూమ్‌ను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేయగా, నాగచైతన్య నాలుగు నూతన స్క్రాంబ్లర్‌ మోడల్స్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి వెంకీమామ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జై లవ కుశ ఫేం కెఎస్ రవీంద్ర-బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూట్ జరుపుకుంటోంది.  ఈ సినిమా రెండవ షెడ్యూల్ ఇటవల హైదరాబాద్ లో మొద‌లైంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్లో వెంకీ, చైతూ అలాగే ఇతర నటీనటుల మీద కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత నెక్స్ట్ షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే జరుగనుంది. సుమారు 15రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో ఒక పాట‌ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ అలాగే నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. మల్టీస్తారర్స్ ని తెలుగులో ఆదరిస్తున్న తరుణంలో ఈ సినిమాని ఎలా ఆదరిస్తారో చూడాలి మరి.

 

More Related Stories