English   

ఆ భామ పయనం బాలీవుడ్ కేనా

reshmika
2019-04-26 21:41:12

ఛలో మూవీతో తెలుగు తెరకి పరిచయమైన రష్మిక మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన గీత గోవిందం మూవీతో ఆమె క్రేజీ హీరోయిన్ గా మారింది. స్వతహాగా కన్నడ నటి అయిన ఆమె ఈ రెండు ఇండస్ట్రీలలో రెండు చేతులా సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో నాని సరసన దేవదాస్ మూవీలో నటించినా అది మాత్రం పెద్దగా పేరు తేలేక పోయింది. ప్రస్తుతం రష్మీక చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. మహేశ్ బాబు, నితిన్, అఖిల్, అల్లు అర్జున్, కార్తీ సినిమాల్లో వరుస ఛాన్స్స్ లు కొట్టేసింది ఈ బ్యూటీ. ఇప్పడు తాజాగా ఆమె బాలీవుడ్ కి పయనం అవుతున్నట్టు చెబుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. రణదీప్ హుడా హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మీక ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీతో బల్విందర్ సింగ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తున్నారట. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories