English   

బీజేపీలో చేరిన పాపులర్ సింగర్ 

singer
2019-04-27 08:06:53

బీజేపీలో చేరుతున్న సెలెబ్రిటీల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా, ఆ పార్టీలో పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు దలేర్ మెహంది చేరారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి సమక్షంలో పార్టీలో చేరారు దలేర్ మెహంది. ఆ సమయంలో ఆయన వెంట ఢిల్లీ భాజపా అభ్యర్థి, ప్రముఖ గాయకుడు హన్స్‌రాజ్‌ హన్స్‌ కూడా ఉన్నారు. హన్స్‌ రాజ్‌కు మెహిందికి బంధుత్వం ఉంది. హన్స్‌ కుమారుడితో మెహంది కుమార్తె వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆయనే ఈయన్ని కూడా పార్టీలోకి తెచ్చి ఉండచ్చని అంటున్నారు. అయితే ఈ చేరిక తర్వాత మీడియాతో మాట్లాడిన దలేర్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని గాయకుడు హన్స్ రాజ్ హన్స్ తరపున ప్రచారం నిర్వహిస్తానని పేర్కొన్నారు.  

More Related Stories