English   

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కి నిజంగా మోక్షం కలిగేనా

lakshmisntr
2019-04-27 08:25:04

రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. 1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలయిన చోట్ల మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ  సినిమాను రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ పార్వతి కోణంలో చంద్రబాబు పాత్రను విలన్‌గా చిత్రీకరించడంతో కొంత మందికి మింగుడు పడకపోయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా నిలబడింది. అయితే ఈ సినిమాని ఆంధ్రాలో మినహాయించి మిగతా అన్ని చోట్లా రిలేజ్ చేశారు. కోర్టు దెబ్బకు ఏపీలో చేయలేకపోయారు. ఈ క్రమంలో ఆయన సినిమా అన్ని అవాంతరాలను దాటి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు సిద్దమవుతోంది. మే 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుందని, తెరవెనుక ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ సినిమాని తప్పక చూడండి అంటూ వర్మ ట్వీట్ చేశాడు.  సినిమాలో స్టోరీ సహా దాదాపు అన్నీ బహిర్గతం అయిన తర్వాత ఏపీలో రిలీజ్ కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ? అనేది చూడాలి. ఇదేదో పంతంతో రిలీజ్ చేస్తున్నట్టు ఉంది కానీ దీని వలన నిర్మాతలకు పెద్దగా కలిసోచ్చేది ఏమీ కనిపించడం లేదు.

More Related Stories