English   

తండ్రి బయోపిక్ తీస్తున్న రాధికా శరత్ కుమార్ 

radika
2019-04-27 08:40:48

తన తండ్రి ఎంఆర్ రాధ బయోపిక్ ను రూపొందించ డానికి ప్రయత్నాలు చేస్తూన్నారట తమిళ సీనియర్ నటి రాధిక. ఈ మేరకు ఆమె అందుకు హీరోని కూడా ఎంపిక చేసేసిందని అంటున్నారు. ఎంఆర్ రాధ పాత్ర కోసం శింబును, ఎంజీఆర్ పాత్రకి గాను అరవిందస్వామిని ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఎంఆర్ రాధ మనవడైన ‘ఐకీ’ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలు తమిళ సినీపరిశ్రమను ఏలుతున్నప్పుడు, విలన్ గా ఎంఆర్ రాధ తనదైన ముద్రవేశాడు. పేరుకి ఆయన విలన్ అయినప్పటికీ, తమిళనాట హీరోలతో సమానంగా ఆయన పారితోషకం అందుకునే వాడు. అయితే రాధ ఒకానొక సమయంలో ఎంజీఆర్ పై కాల్పులు జరపడం సంచలనాత్మకమైంది. ఆయన జీవితాన్ని జనానికి చేరవేసేలా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. నిజానికి ఒకప్పటి హీరోయిన్ లు రాధిక, నిరోషా ఆయన కూతుళ్లే, అయితే వారి తల్లులు వేరు. ఇక ఈ మధ్య కాలంలో నయనతార మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధారవి కూడా ఆయన కొడుకే.  

More Related Stories