English   

మజిలీ చైతూ రేట్ పెంచేసింది

Naga Chaitanya
2019-04-27 10:57:27

మజిలీ సినిమా హిట్ కావడంతో న‌టి సమంత తన పారితోషికం పెంచేసినట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఆ విషయం మీద క్లారిటీ రాకుండానే ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా తన రెమ్యునరేషన్ పెంచేశాడనే టాక్ వినిపిస్తోంది. నిజానికి చాలా కాకంగా చైతూకి హిట్ లేదు,  శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి, యుద్ధం శరణం లాంటి సినిమాలు వచ్చి ఆయనని పూర్తిగా నిరాశ పరిచాయి. అయితే భార్యతో కలిసి చేసిన మజిలీ అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో చైతు రెమ్యునరేషన్ పెంచినట్టు టాక్ వినిపిస్తోంది. ఆయన ఇప్పుడు తీసుకుంటున్న పారితోషికానికి మరో కోటి చేర్చి చెబుతున్నట్టుగా సమాచారం. మజిలీ సినిమా సుమారు 35 కోట్ల దాకా రాబడి తెచ్చి ఇంకా క్రీజు లనే ఉంది. సో ఆయన మార్కెట్  పెరిగినట్టే. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ లో ఉన్న చైతు ఆ సినిమా కాకుండా మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. ఒకటి దిల్ రాజు నిర్మాణంలో రూపొందే లవ్ స్టొరీ కాగా మరొకటి ఆరేక్స్ 100 ఫేం అజయ్ భూపతి తీయబోయే మహాసముద్రం. దీంట్లో సమంతనే హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి.

More Related Stories