English   

చిన్నల్లుడి కోసం రంగంలోకి దిగిన రజనీ 

Rajinikanth
2019-04-27 12:10:11

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య ఈమధ్యే విశాగన్ వనంగమూడి అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సౌందర్యకు విశాగన్ కు ఇద్దరికీ ఇది రెండో వివాహమే. అయితే ఈ వ్యక్తి వ్యాపారవేత్త మాత్రమే కాదు  సినీరంగంలో కూడా నటుడిగా రాణించాలని కోరిక ఉందట. ఇప్పటీకే రజనీకాంత్ పెద్దల్లుడు ధనుశ్ తమిళనాట స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. దీంతో ఇప్పుడు పెద్దల్లుడి మాదిరిగానే చిన్నల్లుడు విశాగన్ ను కూడా హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. రజనీ రాజకీయాల్లోకి వెళితే నటనకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది, ఈలోపే రెండో అల్లుడిని కూడా హీరోని చేస్తే తన పార్టీకి కూడా సినిమా గ్లామర్ గట్టిగానే ఉంటుందనే భావనలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే తనకు పేటసినిమాతో హిట్ ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ ను పిలిపించి, విశాగన్ కోసం ఒక మంచి కథను తయారు రెడీ చేసుకుని ఆయనతో ఒక మూవీ చేయమని చెప్పారట. అయితే కార్తీక్ తో ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా అల్లుడు నిలదొక్కుకునేవరకూ మంచి ప్రాజెక్టులు సెట్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారట. ఇది రాజకీయంగా తనకు కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆయన వెనక్కు తగ్గట్లేదని అంటున్నారు.

More Related Stories