English   

టాలివుడ్ హీరో కారు యాక్సిడెంట్...మహిళ మృతి !

 Sudhakar Komakula
2019-04-27 16:19:43

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సుధాకర్ కోమకూల హీరోగా నువ్వు తొపురా అనే సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. హరినాథ్ బాబు తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రచారం కోసం ఏపీ వెళ్తున్న సుధాకర్ కోమాకుల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అతనికి  గాయాలు కాగా, కారు ఢీకొన్న  మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై కొద్దిసేపటి ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న  సుధాకర్‌ గాయపడ్డారు.శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు సుధాకర్. ఆ చిత్రంలో తెలంగాణ యాస మాట్లాడి బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు రానున్న సినిమా కూడా తెలంగాణ బేస్డ్ సినిమానే, సరూర్ నగర్ కుర్రాడు అమెరికా వెళ్లి జీవితం కోసం ప్రేమ కోసం ఎలా పోరాడాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

More Related Stories