English   

కీర్తి సురేష్ తెలుగు సినిమా మొదలయిపోయిందా ?

 Keerthy Suresh
2019-04-27 18:00:14

హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి తర్వాత తెలుగు సినిమా ఒక్కటి కూడా ఒప్పుకోలేదు. ఆమె తమిళ్ ఇండస్ట్రీకే పరిమితం అయిపోయింది. తాజాగా ఆమె తరువాతి సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అదేంటంటే నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించనుందని అంటున్నారు. నగేష్ ఇప్పటివరకూ హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్, దోర్ లాంటి సినిమాలు తీశాడు. అవడానికి తెలుగువాడే అయినా ఆయన ఇప్పటి వరకూ తెలుగు సినిమా తీయలేదు. ఆయన తీసే మొట్ట మొదటి తెలుగు సినిమాలో కీర్తితో పాటు, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారని అంటున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని  సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారని సమాచారం. అయితే షాకింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుగుతోందట. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.  

More Related Stories