English   

మహేష్ సినిమాకి ఆసక్తికర టైటిల్ 

 Mahesh
2019-04-27 18:18:08

మహేష్ బాబు తన 25వ మూవీ మహర్షితో మే9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడడంతో మహేష్ బాబు తన తరువాతి సినిమా మీద ద్రుష్టి పెట్టారు. మూడు హిట్ సినిమాలు కొట్టి తాజాగా F2 సినిమాతో హిట్ అందుకున్న అనీల్ రావిపూడితో తన తరువాతి సినిమా చేయబోతున్నారు మహేష్. ఈ సినిమా మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏకధాటిగా షూటింగ్ జరిపి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్‌ పెట్టాలని అనుకుంటున్నారని సమాచారం. అంతెకాక ఈ సినిమా కోసం ప్రస్తుతం కర్నూల్ తో పాటు చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో లొకేషన్ల కోసం వెతుకుతున్నారని సమాచారం. అనిల్ టీమ్ లోని ఒక కీలక వక్తి ఇప్పుడు కర్నూల్ లో అదే పనిలో ఉన్నారట. అయితే వీటన్నింటిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

More Related Stories