English   

సురేష్ ప్రొడక్షన్స్ నుండి అరడజను సినిమాలు...చిన్నవే

sp
2019-04-27 19:41:11

సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఒక కొత్త వ్యాపార టెక్నిక్ ఫాలో అవుతున్నట్టు ఉంది. అదేంటంటే నేరుగా సినిమాలు తీయకుండా చిన్న సినిమాలు చేసుకుని వచ్చిన వారి సినిమాలు చూసి అవి బాగా నచ్చితే ఒక అవుట్ రేట్ కి కొనేసి తామే సినిమాని రిలీజ్ చేసుకోవడం అన్న మాట. నిజానికి బయట నిర్మాతలు తెలుగులో సినిమాలు తీయడం సులభమే కానీ సినిమాలు రిలీజ్ చేయడమే కష్టం, ఎందుకంటే సింహ భాగం థియేటర్లు, సురేష్ ప్రొడక్షన్స్,గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అయితే మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో సురేష్ ప్రొడక్షన్స్ ముందు నుండీ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోంది. అలా ఈ బ్యానర్ నుంచి ఈ ఏడాది వరుసగా 6 సినిమాలు థియేటర్లకు రానున్నాయి. ఆ సినిమాలు ఏమేం అంటే సమంత - నందిని రెడ్డి కాంబినేషన్ సినిమా `ఓ బేబి`, అల్లు శిరీష్ `ఏబీసీడీ`, ఆనంద్ దేవరకొండ (విజయ్ దేవరకొండ తమ్ముడు) - శివాత్మిక రాజశేఖర్(రాజశేఖర్ రెండో కూతురు) కలిసి నటిస్తున్న దొరసాని, మలయాళ అంగమళై డైరీస్ తెలుగు రీమేక్ సినిమా ఫలక్ నుమా దాస్, అలాగే  పద్మశ్రీ చింతకింది మల్లేశం బయోపిక్ `మల్లేశం`..`బ్రోచేవారెవరురా` సినిమాలు సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వరుసగా విడుదల కానున్నాయి. ఈ సినిమాల విడుదల తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. 

More Related Stories