English   

మరో క్రేజీ ప్రాజెక్ట్ ఒప్పుకున్న ప్రియా ప్రకాష్

priya
2019-04-27 21:32:30

కొంతమందికి హిట్ లు, ఫట్ లు, సాధ్యాసాధ్యాలతో పని లేకుండా అవకాశాలు వస్తాయి. అలాంటి వారిలో ముందుంది మలయాళీ భామ ప్రియా ప్రకాష్. ఆమె నటించిన మొదటి సినిమా `ఒరు ఆడార్ లవ్ అన్ని బాషలలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కన్నుగీటు తప్ప ఇంకేదీ లేదని ఫ్లాప్ చేసి పెట్టారు ప్రేక్షకులు. అయితే ఆమె ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ అమ్మడు వరుసగా పలు ఆఫర్లు అందుకుంది. అందులో `శ్రీదేవి బంగ్లా` అనే బాలీవుడ్ సినిమా కూడా ఉంది. శ్రీదేవి బాత్ టబ్ లో పడి దుర్మరణం పాలైన విషయాన్ని ఫిక్షనల్ గా అదో మర్డర్ మిస్టరీగా చిత్రీకరిస్తున్నారని బోనీ కపూర్ కోర్టు లో కేసు వేసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి బంగ్లా ఇంకా రిలీజ్ కాకముందే ఆమె మరో సినిమాకు సైన్ చేసిందట. మయాంక్ ప్రకాష్ శ్రీవాస్తవ దర్శకత్వం వహిస్తున్న సైబర్ క్రైమ్ నేపథ్య సినిమా అయిన లవ్ హ్యాకర్స్ అనే టైటిల్ తో వస్తున్న సినిమాని ఆమె ఓకే చేసిందట. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో పలు కార్పొరెట్ ఉత్పత్తుల ప్రచారం కోసం భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుని రెండు చేతులా సంపాదిస్తోంది ఈ అమ్మడు. 

More Related Stories