English   

వైష్ణవ్ తేజ్ సినిమాకి భలే మార్కెట్ పెంచుతున్నారు

tej
2019-04-28 08:27:11

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి ఈ మధ్యనే 96, సూప‌ర్ డీల‌క్స్ వంటి విభిన్న సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని అలరించిన విజ‌య్ సేతుప‌తి ప్రస్తుతం లాభం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మ‌రోవైపు తెలుగులో సైరా చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో విజ‌య్ సేతుప‌తి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ మూవీలోను విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తుంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసింది. విజయ్ సేతుపతికి వెల్కం చెప్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ కి భారీ హైప్ పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వైష్ణవ్ మెగా మేనల్లుడు కాబట్టి ఈ సినిమాకు తెలుగులో మాత్రమే మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి ఎంట్రీ తో ఈ సినిమాకి తమిళంలో కూడా క్రేజ్ ఏర్పడుతుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జాలరిగా నటిస్తున్నాడు, అప్పట్లో రిలీజయిన ఫస్ట్ లుక్ కూడా చర్చనీయాంశం అయింది.

 

More Related Stories