English   

డియర్ కామ్రేడ్ గుమ్మడి కాయ కొట్టేశారు

dearcomrade
2019-04-28 09:07:26

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మిస్తోంది. విజయ్ సరసన ఈసినిమాలో రష్మీక మందన కథనాయికగా నటిస్తుంది. విజయ్ స్టూడెంట్ పాత్రలో నటించగా రష్మిక క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. మొదట ఈమూవీని మే31న విడుదల చేయాలని భావించారు. అయితే ఈసినిమాను జూన్ 19కి వాయిదా వేయాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి, ముందు అనుకున్న తేదీన  తమిళ హీరో సూర్య నటించిన ఎన్జీకే మూవీ విడుదల కానుండటంతో విజయ్ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈసినిమా అవుట్ పట్ల విజయ్ సంతృప్తిగా లేడని కొన్ని సీన్లను రీ షూట్ కూడా చేయనున్నారని ప్రచారం జరిగింది. అయితే వాటిని కొట్టి పారేస్తూ ఈ సినిమా షూట్ కి గుమ్మడి కాయ కొట్టేసింది సినిమా యూనిట్. మరి ఈ సినిమా జూన్ 19న అయిన ధియేటర్లలోకి వస్తుందో రాదో చూడాలి మరి.

More Related Stories