English   

సాహో టీమ్ తో బీజేపీ మినిస్టర్ ఫోటోలు

prabhas
2019-04-28 09:35:50

బాహుబ‌లి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో అనే చిత్రాన్ని చేస్తున్నాడు. స్పై థ్రిల్ల‌ర్‌ గా గ్యాంగ్ వార్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్‌ లు యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ తెలుగు తమిళ మలయాళ ఇండస్ట్రీల వరకూ పని చేసినా అది బాలీవుడ్ లో కూడా పని చేసేందుకు నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్‌ ని ప్రధాన పాత్రల్లో నటింప చేస్తున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ లో రేంజ్ లో ప్రెజంట్ చేయడానికి అక్కడి టెక్నీషియ‌న్స్ ని ఈ సినిమాకి తీసుకుని మరీ పని చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ముంబైలోని కర్జాత్ స్టూడియోలో వేసిన సెట్‌ లో షూట్ జ‌రుగుతుండ‌గా అక్కడి బీజేపీ ముఖ్యనేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షూటింగ్ స్పాట్‌ను సందర్శించారు. ప్ర‌భాస్‌, సుజీత్‌, శ్ర‌ద్దా క‌పూర్‌తో క‌లిసి గ‌డ్క‌రీ ఫోటోలు దిగారు. ప్ర‌స్తుతం వారి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగ‌స్ట్ 15న చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.

More Related Stories