English   

అరుణ్ విజయ్ సరసన చాన్స్ కొట్టేసిన నివేదా

Arun
2019-04-28 09:59:42

తమిళ యువ నటుడు అరుణ్‌ విజయ్‌ సరసన నివేదా పేతురాజ్‌ జత కట్టబోతోంది. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో చెక్క చివంత వానం సినిమాతో హిట్ కొట్టిన అరుణ్‌ విజయ్, తాజాగా తడం సినిమాతో మరో హిట్‌ ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మూడర్‌ కూట్టం చిత్రం ఫేమ్‌ నవీన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనితో కలిసి అగ్ని సిరగుగల్‌ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు తెలుగులో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సాహోలో కూడా మంచి రోల్ చేస్తున్నారు. వీటితో పాటు అరుణ్‌ విజయ్‌ మరో సినిమా చేస్తున్నారు. దీనికి దృవంగళ్‌ పదునారు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న  యువ దర్శకుడు కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నటి నివేదా పేతురాజ్‌ ను హీరొయిన్ గా ఎంపిక చేశారు. లైకా ప్రొడక్షన్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది.

More Related Stories